India vs England, World Cup 2023: ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ తడబాటు, ఇంగ్లీష్ సేన లక్ష్యం కేవలం 230 పరుగులు మాత్రమే..సున్నాకే ఔట్ అయిన కోహ్లీ..
2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరుగుతున్న వన్డే మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. భారత్ టాప్ ఆర్డర్ దారుణంగా తడబడింది. కేవలం రోహిత్ శర్మ 101 బంతుల్లో 87 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 49 పరుగులతో ఇన్నింగ్స్ ఆడి చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.
2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరుగుతున్న వన్డే మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. భారత్ టాప్ ఆర్డర్ దారుణంగా తడబడింది. కేవలం రోహిత్ శర్మ 101 బంతుల్లో 87 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 49 పరుగులతో ఇన్నింగ్స్ ఆడి చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. అంతకుముందు రోహిత్, శుభ్‌మన్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే వరుసగా వికెట్లు కోల్పోయి భారత్ చిక్కుల్లో పడింది. విరాట్ కోహ్లి కూడా సున్నా పరుగులకే అవుటయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఖాతా కూడా తెరవలేకపోయాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్ శర్మ మాత్రం యాభై పరుగులు చేసి క్రీజులో నిలబడి ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాట్స్ మెన్ పరుగులు సాధించడంలో దారుణంగా విఫలం చెందారు.