Ravi Bishnoi: భారత్‌కు మరో అద్భుత స్పిన్నర్ దొరికాడు, దుమ్మురేపుతున్న రవి బిష్ణోయ్‌, 24 బంతులు వేస్తే 17 బాల్స్ డాట్‌ బాల్స్‌, 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్న యువబౌలర్

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో భోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌ ద్వారా లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. టి20 క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా అతను నిలిచాడు. బిష్ణోయ్‌ అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే సూపర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

File image of Ravi Bishnoi (Photo Credits: Twitter / BCCI)

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో భోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌ ద్వారా లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. టి20 క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా అతను నిలిచాడు. బిష్ణోయ్‌ అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే సూపర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌లో అతని ‘గూగ్లీ’లను ఆడలేక ఇబ్బంది పడిన విండీస్‌ బ్యాటర్లు ఒకే ఒక ఫోర్‌ కొట్టగలిగారు. బిష్ణోయ్‌ వేసిన 24 బంతుల్లో 17 బాల్స్ డాట్‌ బాల్స్‌ ఉన్నాయి. మొత్తం మీద 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.

మొదటి మ్యాచ్‌లో సహజంగానే ఉండే ఒత్తిడి వల్ల క్యాచ్‌ అందుకునే క్రమంలో బౌండరీ లైన్‌ను తాకి సిక్స్‌ ఇచ్చిన అతను 6 వైడ్లు వేశాడు. అయితే ఓవరాల్‌గా చూస్తే బిష్ణోయ్‌ ప్రదర్శన సూపర్‌ అనే చెప్పొచ్చు. రాజస్తాన్‌కు చెందిన బిష్ణోయ్‌ 42 దేశవాళీ టి20 మ్యాచ్‌లలో 6.63 ఎకానమీతో 49 వికెట్లు పడగొట్టాడు. 2020 అండర్‌–19 ప్రపంచకప్‌ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లలో సీనియర్‌ జట్టు తరఫున జట్టుకు తొలి ఆటగాడిగా బిష్ణోయ్‌ గుర్తింపు పొందాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement