ICC Champions Trophy 2025: వీడియో ఇదిగో, ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ బరితెగింపు, కరాచీ స్టేడియంలో మిగత దేశాల జెండాలను పెట్టి భారత జెండాను వదిలేసిన దాయాదీలు

ట్రోఫీ ఆరంభానికి ఇంకా రెండు రోజులే సమయమున్న నేపథ్యంలో కరాచీ స్టేడియంలో అన్ని జట్ల జాతీయజెండాలను ప్రదర్శించారు .అయితే అందులో భారత జాతీయ జెండా లేకపోవడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Indian Flag Controversy In Pakistan Ahead Of Champions Trophy (photo-Arsalan)

పాకిస్థాన్‌ ఆతిథ్యంలో జరిగే ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy 2025)కి సర్వం సిద్ధం అయింది. అయితే టీమ్‌ఇండియా (Team India) ఆడే మ్యాచ్‌లు అన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ట్రోఫీ ఆరంభానికి ఇంకా రెండు రోజులే సమయమున్న నేపథ్యంలో కరాచీ స్టేడియంలో అన్ని జట్ల జాతీయజెండాలను ప్రదర్శించారు .అయితే అందులో భారత జాతీయ జెండా లేకపోవడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో వాస్తవమా కాదా అనేది ధృవీకరించాల్సి ఉంది. ఈ వీడియోపై ఇరు జట్ల బోర్డుల నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఈ సారి భారత్ విజేతగా నిలబడుతుందా ఈ జట్టుతో.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ‌లో పాల్గొనే అన్నిజట్ల ఆటగాళ్లు జాబితా ఇదిగో

కరాచీ స్టేడియం వేదికగా.. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ జట్ల మ్యాచ్‌లు జరగనున్నాయి.ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జెండాలు ప్రదర్శించాల్సినచోట భారత జాతీయజెండా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇక పాకిస్థాన్‌ గడ్డపై ఆడేందుకు విముఖత చూపించినందుకు భారత ఆటగాళ్లను ఎవరూ హగ్‌ చేసుకోవద్దని తమ క్రికెటర్లను అభిమానులు ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈమేరకు పాక్‌ జర్నలిస్ట్‌ ఒకరు తన సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు.

 No Indian flag at Champions Trophy venue in Pakistan

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now