IPL 2022: రవీంద్ర జడేజా, బ్రావో ఆవేశం మాములుగా లేదండోయ్, క్యాప్‌ను తీసి నేలకేసి కొట్టబోయి ఆగిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, సోసల్ మీడియాలో వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి చెందిన సంగతి విదితమే. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా అసహనానికి గురై తన క్యాప్‌ను తీసి నెలకేసి కొట్టబోయాడు.
ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి చెందిన సంగతి విదితమే. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా అసహనానికి గురై తన క్యాప్‌ను తీసి నేలకేసి కొట్టబోయాడు. కానీ చివరికి తన భావోద్వేగాలను జడేజా కంట్రోల్ చేసుకున్నాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 17 ఓవర్‌లో డ్వేన్ బ్రావో వేసిన స్లో డెలివరీని డీప్ మిడ్ వికెట్ దిశగా బౌండరీ బాదేందుకు డేవిడ్ మిల్లర్ ప్రయత్నించాడు.
అయితే షాట్ కనెక్షన్ సరిగ్గా కుదరకపోవడంతో డిప్ మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శివమ్ దుబేవైపు బంతి వెళ్లింది. అయితే ఫ్లడ్‌లైట్‌లు కారణంగా దుబే కనీసం బంతిని పట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది కెప్టెన్ జడేజా, బ్రావోకి కోపం తెప్పిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా డేవిడ్ మిల్లర్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గుజరాత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 51 బంతుల్లో మిల్లర్ 94 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)