IPL 2022: అద్భుతమైన సీన్.. సచిన్ కాళ్లు మొక్కిన జాంటీరోడ్స్, ఒక్కసారిగా ఖంగుతిన్న టెండూల్కర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 14) జరిగిన రసవత్తర పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. , పంజాబ్‌-ముంబై జట్ల మధ్య మ్యాచ్‌ అనంతరం మైదానంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

Jonty Rhodes Touches Sachin Tendulkar's Feet

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 14) జరిగిన రసవత్తర పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. , పంజాబ్‌-ముంబై జట్ల మధ్య మ్యాచ్‌ అనంతరం మైదానంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో పంజాబ్‌ బ్యాటింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ సచిన్ టెండూల్కర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండా పాదాలకు నమస్కారం చేయబోయాడు. ఈ హఠాత్పరిణామంతో ఆశ్చర్యపోయిన సచిన్‌ వెంటనే తేరుకుని జాంటీని వారించాడు. అనంతరం ఇరువురు ఆత్మీయంగా హత్తుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement