Yuzvendra Chahal: అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన యుజవేంద్ర చాహల్‌, తరువాతి బంతికే వికెట్ తీసి కసి తీర్చుకున్న రాజప్థాన్ రాయల్స్ స్పిన్నర్, వీడియో వైరల్

ఫీల్డ్‌లో ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే యుజవేంద్ర చాహల్‌.. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోపంతో ఊగిపోయాడు. లక్నో ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన చాహల్‌ ఐదో బంతిని ఫుల్‌ ఆఫ్‌ సైడ్‌ వేశాడు. అయితే ఆనూహ్యంగా అంపైర్‌ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు.

Yuzvendra Chahal (Photo credit: Twitter)

ఫీల్డ్‌లో ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే యుజవేంద్ర చాహల్‌.. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోపంతో ఊగిపోయాడు. లక్నో ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన చాహల్‌ ఐదో బంతిని ఫుల్‌ ఆఫ్‌ సైడ్‌ వేశాడు. అయితే ఆనూహ్యంగా అంపైర్‌ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. కాగా రీప్లేలో బంతి లైన్‌ లోపల ఉన్నట్లు కనిపించింది. దీంతో అసహనానికి గురైన చాహల్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా అంపైర్‌ తీసుకున్న నిర్ణయం పట్ల కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కూడా ఆసంతృప్తిగా ఉన్నట్లు కన్పించింది. కాగా తరువాతి బంతికే చమీరాను చాహల్‌ పెవిలియన్‌కు పంపాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement