IPL 2022: దుమ్మురేపిన బెంగుళూరు, రాజస్థాన్‌పై అద్బుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్, చివర్లో మెరుపులు మెరిపించిన షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్

రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ విసిరిన 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) మంచి ఆరంభమే అందించారు. అయితే ఇద్దరూ భారీ స్కోర్లు చేయకుండానే వెనుతిరిగారు.

Dinesh Karthik Helps Royal Challengers Bangalore Register Second Successive Win

రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ విసిరిన 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) మంచి ఆరంభమే అందించారు. అయితే ఇద్దరూ భారీ స్కోర్లు చేయకుండానే వెనుతిరిగారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (5) కూడా కమ్యూనికేసన్ గ్యాప్ వల్ల రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే డేవిడ్ విల్లే (0)ను చాహల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (5) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటవడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైందని అంతా అనుకున్నారు.

అయితే షాబాజ్ అహ్మద్ (45), దినేష్ కార్తీక్ (23 బంతుల్లో 44 నాటౌట్) అద్భుతమైన ఆటతీరుతో ఆర్సీబీని విజయం వైపు తీసుకెళ్లారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్‌లో డీకే రెండు ఫోర్లు బాదడంతో బెంగళూరు విజయానికి 3 పరుగులు కావలసి వచ్చాయి. 20వ ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదిన హర్షల్ పటేల్ (9 నాటౌట్) బెంగళూరుకు విజయాన్ని అందించాడు. ఇది ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు తొలి ఓటమి కాగా.. బెంగళూరుకు రెండో విజయం. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ చెరో రెండు వికెట్లు తీయగా.. సైని ఒక వికెట్ తీశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement