'Shot of the Tournament': వార్నర్ మైండ్ బ్లోయింగ్ షాట్ వీడియో, మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన బౌండరీ షాట్, ఒక్కసారిగా ఖంగుతిన్న భువనేశ్వర్‌ కుమార్‌

ఐపీఎల్‌-2022లో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అదరగొట్టాడు. 58 బంతుల్లో ఏకంగా 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో వార్నర్‌ అజేయంగా నిలిచాడు. కాగా భువనేశ్వర్‌ కుమార్‌ ఓవర్‌లో వార్నర్‌ ఆడిన షాట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

David Warner shot (Photo IPL/BCCI)

ఐపీఎల్‌-2022లో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అదరగొట్టాడు. 58 బంతుల్లో ఏకంగా 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో వార్నర్‌ అజేయంగా నిలిచాడు. కాగా భువనేశ్వర్‌ కుమార్‌ ఓవర్‌లో వార్నర్‌ ఆడిన షాట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ తొలి బంతిని వేయడానికి సిద్దమయ్యాడు. అయితే స్ట్రైక్‌లో ఉన్న వార్నర్‌ స్విచ్‌ హిట్‌ ఆడేందుకు రెడీ అయ్యాడు. అయితే ముందుగానే పసికట్టిన భువీ.. వైడ్‌ యార్కర్‌ వేశాడు. అయితే భువనేశ్వర్ బౌలింగ్‌ తగ్గట్టుగానే.. వార్నర్‌ క్షణాల్లో తన ప్లాన్ మార్చుకుని రైట్ హ్యాండర్ ఆడినట్లు షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement