IPL 2022: పోనీలే.. మరోసారి నన్ను అవుట్ చేయడానికి ట్రై చెయ్‌, చహల్‌కు హగ్‌ ఇచ్చి ఓదార్చిన సూర్యకుమార్‌

ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ చహల్‌ వేశాడు. ఆ ఓవర్‌ చివరి బంతిని సూర్యకుమార్‌ స్వీప్‌షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా మిస్‌ అయింది. దీంతో బంతి సూర్య ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. చహల్‌ ఔట్‌ అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు

Suryakumar Yadav consoles Yuzvendra Chahal with bear hug

ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ చహల్‌ వేశాడు. ఆ ఓవర్‌ చివరి బంతిని సూర్యకుమార్‌ స్వీప్‌షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా మిస్‌ అయింది. దీంతో బంతి సూర్య ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. చహల్‌ ఔట్‌ అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. దీంతో చహల్‌ డీఆర్‌ఎస్‌ కోరాడు. అయితే రిప్లేలోనూ బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్‌ పైనుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో థర్డ్‌​అంపైర్‌ కూడా నాటౌట్‌ ప్రకటించాడు. థర్డ​ అంపైర్‌ నిర్ణయంతో షాక్‌ తిన్న చహల్‌ నిరాశకు గురయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ వచ్చి చహల్‌కు హగ్‌ ఇచ్చి ''పోనీలే.. మరోసారి ట్రై చెయ్‌'' అంటూ ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు