IPL 2023: కోహ్లీ సెంచరీతో ఫ్యాన్స్‌కు పండగ, వాళ్లిద్దర్నీ ఘోరంగా ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్న ఆర్‌సీబీ అభిమానులుచ మీమ్స్ ఇవిగో..

విరాట్ కోహ్లీ గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో ఒత్తిడికి లోనవకుండా చక్కగా ఆడి తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు.

Virat Kohli and Gautam Gambhir were involved in war of words after RCB-LSG game (Image: IPL)

విరాట్ కోహ్లీ గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో ఒత్తిడికి లోనవకుండా చక్కగా ఆడి తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఇన్నింగ్స్‌పై ప్రేక్షకులే కాదు.. మాజీ ఆటగాళ్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

దీంతో పాటు కోహ్లీని టార్గెట్ చేసిన లఖ్‌నవూ బౌలర్ నవీన్-ఉల్-హక్‌, గౌతం గంభీర్ పై విరాట్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు దిగారు. వారిద్దరి గురించి ఫన్నీ మీమ్స్ (Funny Memes) షేర్ చేస్తున్నారు. ఇటీవల ఒక మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ అయినపుడు నవీన్ మామిడి పండ్ల ముక్కలు ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీని ఔట్ చేసిన బౌలర్‌ను గంభీర్ ప్రశంసించాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ బాగా ఆడినప్పుడల్లా అతడి ఫ్యాన్స్ నవీన్, గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Tweets

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement