Virat Kohli Six Video: కోహ్లీ సిక్స్ వీడియో ఇదిగో, బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయిన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విక్టరీ
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ విధించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఈ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కోహ్లి కొట్టిన సిక్స్ ని చూసిన డుప్లెసిస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కోహ్లి, డుప్లెసిస్ అద్భుత ప్రదర్శన కారణంగా 19.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌నకు చేరువైంది.
Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)