IPL 2023: ఆర్సీబీపై సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం, ప్రత్యర్థి అయినా దగ్గరకు వచ్చి హత్తుకున్న విరాట్ కోహ్లీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఐపీఎల్‌-2023 ఆరంభంలో తడబడుతూ ఆడిన టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తరువాత పుంజుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు అర్ధ శతకాలు బాదిన స్కై.. ఆర్సీబీతో తాజా మ్యాచ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు

Suryakumar Yadav (Photo-Twitter)

ఐపీఎల్‌-2023 ఆరంభంలో తడబడుతూ ఆడిన టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తరువాత పుంజుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు అర్ధ శతకాలు బాదిన స్కై.. ఆర్సీబీతో తాజా మ్యాచ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు. బెంగళూరు జట్టు విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సూర్య 35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

కాగా ఆర్సీబీ ఓపెనర్‌, టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి సూర్య ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత అతడిని అభినందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. విజయ్‌ కుమార్‌ వైశాక్‌ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో సూర్యను హత్తుకున్న కోహ్లి.. అతడి వెన్నుతట్టి శుభాభినందనలు తెలిపాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now