Kane Williamson: సీనియర్ ఆటగాడు..ఔటైన విధానం చూస్తే షాకే..ఇంగ్లాండ్‌తో టెస్టులో కేన్ విలియమ్సన్‌ విచిత్ర రీతిలో ఔట్...వీడియో ఇదిగో

అర్ధసెంచరీకి ఆరు ప‌రుగుల దూరంలో అనూహ్య రీతిలో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 59వ ఓవ‌ర్‌ లోని చివ‌రి బంతిని విలియ‌మ్స‌న్ డిఫెన్స్ ఆడాడు.

Kane Williamson bizarre dismissal against England(Video grab)

హామిల్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. అర్ధసెంచరీకి ఆరు ప‌రుగుల దూరంలో అనూహ్య రీతిలో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 59వ ఓవ‌ర్‌ లోని చివ‌రి బంతిని విలియ‌మ్స‌న్ డిఫెన్స్ ఆడాడు.

అయితే.. ఆ బంతి బౌన్స్ అయి స్టంప్స్ వైపుగా వెళ్లింది. వికెట్ల పై బాల్ ప‌డుతుంద‌ని భావించిన విలియ‌మ్స‌న్‌.. బంతిని ప‌క్క‌కు నెట్టాల‌ని భావించాడు. ఈ క్ర‌మంలో త‌న కాలిలో బంతికి ప‌క్క‌కు అనాల‌ని అనుకున్నాడు. అయితే.. అత‌డి చ‌ర్య కంటే ముందుగానే బంతి వికెట్ల‌ను ప‌డ‌గొట్టింది. దీంతో విలియమ్సన్ తీవ్ర అసంతృప్తితో పెవిలియన్ చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  గుకేష్..నీవు తెలుగోడివా త‌మిళోడివా, స్టాలిన్, చంద్రబాబు ట్వీట్లతో ఆన్‌లైన్‌లో ర‌చ్చ ర‌చ్చ‌, అత‌ని పూర్వీకుల అంశంపై మొదలైన చర్చ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)