MK Stalin and Chandrababu Naidu and Gukesh (photo-X)

ప్ర‌పంచ చెస్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించిన గుకేశ్‌ మా రాష్ట్రం వాడు అంటూ తెలుగు, త‌మిళ రాష్ట్రాలు పోటీప‌డుతున్నాయి. విశ్వవిజేత‌గా నిలిచి గుకేశ్ త‌మ‌వాడే అంటూ త‌మిళులు, కాదు మావాడే అంటూ తెలుగు ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియాలో వార్ కొన‌సాగిస్తున్నారు. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన ట్వీట్లు దీనికి మరింత ఆజ్యం పోశాయి.

గుకేశ్‌కు ప్రపంచ చెస్ విజేత కాగానే గురువారం రాత్రి 7.25 నిమిషాల‌కు సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు. గుకేశ్ అసాధార‌ణ ప్ర‌తిభతో చెన్నై మ‌రోసారి ప్ర‌పంచ చెస్ రాజ‌ధానిగా ఖ్యాతిగాంచింద‌న్నారు. మ‌రో చాంపియ‌న్ ఇక్క‌డే పుట్టిన‌ట్లు పేర్కొన్నారు. త‌మిళ‌నాడుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. గుకేశ్ మెడ‌లో గోల్డ్ మెడ‌ల్ వేస్తున్న ఓ పాత ఫోటోను కూడా సీఎం స్టాలిన్ త‌న ట్వీట్‌లో షేర్ చేశారు.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌ గుకేశ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, మిలియన్ల మంది యువకులు పెద్ద కలలు కనడానికి నీ విజయం ప్రేరణ అంటూ ట్వీట్

కొన్ని నిమిషాల తేడాలోనే ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ఓ ట్వీట్ చేశారు. తెలుగు కుర్రోడికి హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు చెబుతున్న‌ట్లు సీఎం చంద్ర‌బాబు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. యావ‌త్ దేశం ఈ ఘ‌న‌త‌ను సెల‌బ్రేట్ చేసుకుంటోంద‌న్నారు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని విజ‌యాలు న‌మోదు చేయాల‌ని చంద్ర‌బాబు ఆకాంక్షించారు.గుకేశ్ పేరెంట్స్ తెలుగువాళ్లు. కానీ చెన్నైలో పుట్టి, పెరిగాడు. త‌ల్లితండ్రులు ఇద్ద‌రూ వైద్యులే. గుకేశ్ ఛాంపియ‌న్‌గా తేల‌డంతో అత‌ని పూర్వీకుల అంశంపై ఆన్‌లైన్ చ‌ర్చ మొద‌లైంది.

CM Stalin Tweet

CM Chandrababu Tweet

Nitezen Tweet

ఇక గుకేశ్‌కు తమిళనాడు ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించిన విషయాన్ని చాలామంది గుర్తుచేశారు. ఈ చెస్ స్టార్‌కు స్టాలిన్ ప్రభుత్వం ఏప్రిల్‌లో రూ. 75 లక్షలు సాయం చేసినప్పటి స్క్రీన్ షాట్లను పంచుకుంటున్నారు.