IPL 2022: కోల్‌కతాను ఇంటికి పంపిన క్యాచ్ వీడియో ఇదే, 30 గజాల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని అందుకున్న ఎవిన్ లివిస్
ఐపీఎల్‌లో బుధవారం లక్నో వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌లో ఎవిన్ లివిస్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో కోలకతా ఇంటికి బయలుదేరింది. 211 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి ఓవర్‌లో 21 రన్స్ చేయాలి. అయితే ఆ ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్లో రింకూ సింగ్ భారీ షాట్లతో అలరించాడు
ఐపీఎల్‌లో బుధవారం లక్నో వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌లో ఎవిన్ లివిస్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో కోలకతా ఇంటికి బయలుదేరింది. 211 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి ఓవర్‌లో 21 రన్స్ చేయాలి. అయితే ఆ ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్లో రింకూ సింగ్ భారీ షాట్లతో అలరించాడు. అతను తొలి నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు. అయితే చివరి రెండు బంతుల్లో మూడు రన్స్ చేయాల్సిన సమయంలో మ్యాచ్ అనూహ్యంగా టర్న్ తీసుకున్నది.
స్టోయినిస్ బౌలింగ్‌లో మరోసారి భారీ షాట్‌కు రింకూ సింగ్ ప్రయత్నించాడు. అయితే బంతి కవర్స్ ప్రాంతంలో గాలిలోకి ఎగిరింది. పాయింట్ ఏరియలో ఫీల్డింగ్‌లో ఉన్న ఎవిన్ లివిస్ సుమారు 30 గజాల దూరం ఉరికి వచ్చి ఆ బంతిని అందుకున్నాడు. ఎడమ చేతితో ఆ క్యాచ్ పట్టేసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. లివిస్ క్యాచ్ పట్టిన తీరు ఒకరకంగా కేకేఆర్‌కు నిరాశనే మిగిల్చింది. ఇక చివరి బంతికి ఉమేశ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.