KL Rahul Six Video: మ్యాచ్ మెత్తానికి హైలెట్‌, కెఎల్ రాహుల్ కొట్టిన సిక్సర్ వీడియో ఇదిగో, దెబ్బకు స్టేడియం అవతల పడిన బంతి

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. ఇప్పుడు ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ అర్ధ శతకంతో మెరిశాడు. కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.

KL Rahul (Photo-BCCI)

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. ఇప్పుడు ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ అర్ధ శతకంతో మెరిశాడు. కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. ఆసీస్‌ బౌలర్‌ కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో రాహుల్‌ కొట్టిన సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. 35 ఓవర్‌ వేసిన గ్రీన్‌ బౌలింగ్‌లో మూడో బంతికి రాహుల్‌.. డిప్‌మిడ్‌ వికెట్‌ దిశగా ఓ భారీ సిక్సర్‌ బాదాడు. రాహుల్‌ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 99 పరుగుల తేడాతో ఆసీస్‌ను భారత్‌ చిత్తు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.

KL Rahul's Mammoth Six Against Australia Lands On Roof Of Indore's Holkar Stadium

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement