IND vs SA 3rd T20I: కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్ మాయాజాలానికి కుప్పకూలిన సఫారీలు, గత మ్యాచ్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసిన భారత్

గురువారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో భారత్‌ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

Kuldeep Yadav (Photo/X/BCCI)

వాండరర్స్‌ మైదానంలో భారత్‌ గత మ్యాచ్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో భారత్‌ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ , ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు శతకంతో చెలరేగాడు.ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (41 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు.

అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ ప్రభావం చూపలేకపోయింది. చివరకు ఆ జట్టు 13.5 ఓవర్లలోనే 95 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్‌ మిల్లర్‌ (25 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా, మార్క్‌రమ్‌ (25) ఫర్వాలేదనిపించాడు. భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (5/17) తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థిని పడగొట్టాడు. తొలి టి20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా... తాజా ఫలితంతో 1–1తో టి20 సిరీస్‌ సమంగా ముగిసింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్‌ జరుగుతుంది.

Here's BCCI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)