Hasin Jahan on Mohammed Shami: వీడియో ఇదిగో, మాకు డబ్బులివ్వాలంటే గట్టిగా సంపాదించాలిగా, మొహమ్మద్ షమీ ప్రదర్శనపై భార్య హసీన్‌ జహాన్‌ సంచలన వ్యాఖ్యలు

తానేం క్రికెట్‌కు గానీ క్రికెటర్లకు అభిమానిని కాదని తెలిపింది. ‘వరల్డ్‌ కప్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అతడు మంచి ప్రదర్శనలు చేస్తూ ఇలాగే ఆడితే అతడికి భారత జట్టులోనే ఉంటాడు. బాగా సంపాదిస్తాడు. అది మా భవిష్యత్‌ను మరింత సురక్షితం చేస్తుంది’ అని వెల్లడించింది.

Mohammed Shami and Hasin Jahan (Photo-X-Video Grab)

మొహమ్మద్ షమీ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న నేపథ్యంలో అతడి మాజీ భార్య హసీన్‌ జహాన్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఓ టీవీ ఛానెల్‌ చర్చలో పాల్గొన్న హసీన్‌కు షమీ ప్రదర్శనపై యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. తానేం క్రికెట్‌కు గానీ క్రికెటర్లకు అభిమానిని కాదని తెలిపింది. ‘వరల్డ్‌ కప్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అతడు మంచి ప్రదర్శనలు చేస్తూ ఇలాగే ఆడితే అతడికి భారత జట్టులోనే ఉంటాడు. బాగా సంపాదిస్తాడు. అది మా భవిష్యత్‌ను మరింత సురక్షితం చేస్తుంది’ అని వెల్లడించింది. మాకు డబ్బులివ్వాలంటే సంపాదించాలిగా అని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్‌ అవుతోంది.

షమీ-హసీన్‌ జహాన్‌లు 2014లో పెళ్లి చేసుకోగా 2015లో వారికి కూతురు జన్మించింది. కానీ 2018లో హసీన్‌.. షమీపై వేధింపుల కేసు నమోదుచేసింది. కొద్దిరోజుల క్రితమే గృహహింస కేసు కింద కోల్‌కతా కోర్టు.. షమీ, హసీన్‌కు నెలకు లక్షా ముప్పై వేల రూపాయలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. 2018 నుంచి ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

Mohammed Shami and Hasin Jahan (Photo-X-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now