ICC ODI Bowlers Rankings: మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చేసిన సిరాజ్, ఏకంగా 8 స్థానాలు ఎగబాకి ఫస్ట్ ప్లేస్, ఐసీసీ తాజా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ ఇవిగో..
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి ప్రపంచ నెంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి ప్రపంచ నెంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ని వెనక్కినెట్టి 694 రేటింగ్ పాయింట్లతో టాప్-1లోకి దూసుకువచ్చాడు. శ్రీలంకతో ఆసియా వన్డే కప్ ఫైనల్లో సిరాజ్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఈ హైదరాబాదీ స్టార్.. మరో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు.
గా ఈ ఏడాది ఆరంభంలో సిరాజ్ మొట్టమొదటి సారి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసియా టోర్నీ తాజా ఎడిషన్‌లో సిరాజ్ 12.2 సగటుతో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐసీసీ తాజా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే
1. మహ్మద్ సిరాజ్- ఇండియా- 694 పాయింట్లు
2. జోష్ హాజిల్‌వుడ్- ఆస్ట్రేలియా- 678 పాయింట్లు
3. ట్రెంట్ బౌల్ట్- న్యూజిలాండ్- 677 పాయింట్లు
4. ముజీబ్ ఉర్ రెహమాన్- అఫ్గనిస్తాన్- 657 పాయింట్లు
5. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 655 పాయింట్లు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)