Delhi High Court: OFS ప్లాట్‌ఫారమ్‌లు తమ పేర్లు, చిత్రాలు ఉపయోగించకుండా ఆపండి, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్
ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు (OFS) తమ పేర్లు, చిత్రాలతో NFT (Non-fungible Tokens)లను ఉపయోగించకుండా ఆపాలని క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.సిరాజ్, పటేల్, రారియో, ఇతరులు ఏప్రిల్ 26 నాటి సింగిల్ జడ్జి ఆదేశాలకు వ్యతిరేకంగా డివిజన్ బెంచ్ ముందు అప్పీలు దాఖలు చేశారు.
ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు (OFS) తమ పేర్లు, చిత్రాలతో NFT (Non-fungible Tokens)లను ఉపయోగించకుండా ఆపాలని క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.సిరాజ్, పటేల్, రారియో, ఇతరులు ఏప్రిల్ 26 నాటి సింగిల్ జడ్జి ఆదేశాలకు వ్యతిరేకంగా డివిజన్ బెంచ్ ముందు అప్పీలు దాఖలు చేశారు. కాగా ఈ ప్లాట్‌ఫారమ్‌లు.. క్రికెటర్లు, సెలబ్రిటీల పేర్లు, చిత్రాలను ఉపయోగించవచ్చని తీర్పులో పేర్కొంది, ఎందుకంటే అలాంటి ఉపయోగం వాక్ స్వాతంత్ర్య హక్కు క్రింద ఉందని సింగిల్ జడ్జి తీర్పును ఇచ్చారు. దీనిని విచారించిన ధర్మాసనం ఒక వారంలోగా తమ వ్రాతపూర్వక సమర్పణలను దాఖలు చేయాలని ఇరుపక్షాలను ఆదేశించింది.కేసును తదుపరి పరిశీలనకు మే 23న జాబితా చేసింది.
Bar and Bench Tweet