ICC World Cup 2023: ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ రికార్డు, తొలి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా రికార్డు కూడా అతనిదే..

ప్రపంచకప్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా అలాగే ప్రస్తుత ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

Mitchell Santner (Photo-ICC)

న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ సాంట్నర్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా అలాగే ప్రస్తుత ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులకు 5 వికెట్లు పడగొట్టిన సాంట్నర్‌.. తొలుత బ్యాట్‌తోనూ రాణించి (17 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 2 వికెట్లు పడగొట్టిన సాంట్నర్‌.. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన వికెట్‌ టేకర్‌గా (7) కొనసాగుతున్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

Here's ICC Tweet