PAK vs IND: వైరల్ వీడియో.. దేశభక్తి అంటే ఇదేనా.. జాతీయ జెండా ఇస్తుంటే వద్దంటూ పక్కకు నెట్టేసిన అమిత్ షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ జై షాపై మండిపడుతున్న నెటిజన్లు
అయితే.. ఈ మ్యాచ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా హాజరయ్యారు.
ఆసియా కప్ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా హాజరయ్యారు. టీమిండియా విజయం అనంతరం జై షా తన ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ అనంతరం లేచి.. చప్పట్లు కొడుతున్న జై షాకు.. ఆయన పక్కనే ఉన్న ఒక వ్యక్తి.. జాతీయ జెండాను పట్టుకోమ్మని.. ఇచ్చాడు.
కానీ జై షా మాత్రం.. జాతీయ జెండాను పక్కకు నెట్టేశారు. దీంతో ఇప్పుడు ఈ సంఘటన వివాదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ మరియు టీఆర్‌ఎస్ పార్టీలు సెటైర్లు పేల్చుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అమిత్ షా దేశ భక్తి అంటూంటే జై షా మాత్రం జాతీయ జెండానే పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.
చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్ పై గెలిచింది. మొదట పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)