Sreesanth: అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం

మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా శ్రీశాంత్ స్పందిస్తూ... యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు క్రికెట్ కు ముగింపు పలుకుతున్నానని చెప్పాడు.

India fast bowler S Sreesanth

టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా శ్రీశాంత్ స్పందిస్తూ... యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు క్రికెట్ కు ముగింపు పలుకుతున్నానని చెప్పాడు. క్రికెట్ కు వీడ్కోలు పలకాలనే నిర్ణయం తనకు సంతోషాన్ని ఇవ్వనప్పటికీ... నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇది తన సొంత నిర్ణయమని అన్నారు. తన జీవితంలో తాను తీసుకున్న ఒక గౌరవప్రదమైన నిర్ణయం ఇది అని చెప్పాడు. క్రికెట్ ను తాను ప్రతి క్షణం ఆస్వాదించానని తెలిపాడు. దేశానికి ఆడటం తనకు ఎంతో గర్వకారణమని చెప్పాడు.

2013 ఐపీఎల్ సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ లో శ్రీశాంత్ దోషిగా తేలాడు. దీంతో ఆయనపై బీసీసీఐ ఏడేళ్ల నిషేధం విధించింది. 2020 సెప్టెంబర్ నాటికి నిషేధం ముగిసినప్పటికీ... ఇండియా తరపున ఆడే అవకాశం అతనికి దక్కలేదు. ఇండియా తరపున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 87 వికెట్లు, వన్డేల్లో 75, టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో 44 వికెట్లు తీశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)