Asia Cup 2022: వైరల్ వీడియో, మీరు భారత జర్నలిస్ట్ కదా, పాకిస్తాన్ ఓటమితో చాలా ఆనందంగా ఫీలై ఉంటారు, జర్నలిస్టుపై మండిపడిన పీసీబీ చీప్ రమీజ్ రాజా
ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీప్ రమీజ్ రాజా భారతీయ జర్నలిస్టుపై వీరంగమాడారు.
ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీప్ రమీజ్ రాజా భారతీయ జర్నలిస్టుపై వీరంగమాడారు. పాకిస్తాన్ జట్టు ఓటమి నేపథ్యంలో మీరిచ్చే సందేశమేమిటని జర్నలిస్టు అడిగిన వెంటనే... మీరు భారత జర్నలిస్టు కదా.. పాక్ ఓడిపోవడం మీకు బాగా ఆనందాన్నిఇచ్చి ఉంటుంది.. అంటూ రమీజ్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను బాధిత జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.అంతేకాకుండా తనను వీడియో తీస్తున్న సదరు జర్నలిస్టు ఫోన్‌ను లాగేసిన రమీజ్.. ఆ తర్వాత దానిని తిరిగి ఆ జర్నలిస్టుకు ఇచ్చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)