Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, వేలం రేసులోకి వచ్చి వెనక్కి తగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్
18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా అర్ష్‌దీప్ నిలిచాడు. మెగా వేలంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు.
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ను రూ. 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా అర్ష్‌దీప్ నిలిచాడు. మెగా వేలంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి సెట్‌లో భాగంగా తొలి ఆటగాడిగా ఆక్షన్‌లోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ పోటీకి వచ్చాయి.అనూహ్యంగా రేసులోకి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అర్ష్‌దీప్ ధరను రూ. 15.75 కోట్లకు పెంచింది.రిటెన్షన్‌కు ముందు అర్ష్‌దీప్‌ను వదిలేసిన పంజాబ్ కింగ్స్ రైజర్స్‌తో పోటీకి దిగింది. రైటు మ్యాచ్ కార్డు ద్వారా అతడిని సొంతం చేసుకుంది.
Arshdeep Singh Sold to PBKS for INR 18 Crore
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)