Maharashtra Road Accident: మరో క్రికెటర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లోనే కన్నుమూసిన మాజీ క్రికెటర్ భార్య, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ హింగానికర్
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మెకర్ తాలుకా సమీపంలోని సంవృద్ది హైవేపై ఆగి ఉన్న ట్రక్‌ను కారు వెనుక నుంచి గుద్దింది
బంగ్లాదేశ్ క్రికెబ్ బోర్డుకు చీఫ్ క్యురేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రవీణ్ హింగానికర్ బుధవారం ఘరో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మెకర్ తాలుకా సమీపంలోని సంవృద్ది హైవేపై ఆగి ఉన్న ట్రక్‌ను కారు వెనుక నుంచి గుద్దింది.ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా ప్రవీణ్ హింగానికర్ భార్య సువర్ణ హింగానికర్ స్పాట్‌లోనే కన్నుమూసింది. తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్‌ను మెకర్ రూలర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రవీణ్ హింగానికర్ విదర్భ తరపున రంజీ క్రికెట్ ఆడాడు. పలు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రవీణ్ 52 మ్యాచ్‌ల్లో 1400 పరుగులతో పాటు 47 వికెట్లు తీసుకున్నాడు. 11 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 271 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టాడు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)