Rashid Khan Six Video: బంతి వైపు చూడకుండానే సిక్సర్‌ బాదిన రషీద్‌ ఖాన్‌, కళ్లు చెదిరే వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ కొట్టిన సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18వ ఓవర్‌ ఆఖరి బంతికి రషీద్‌ బాదిన సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బ్యారీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో రషీద్‌ బంతిని చూడకుండానే సిక్సర్‌గా మలిచాడు

Rashid Khan's no-look six against Ireland in 2nd T20I Watch Video

ఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ కొట్టిన సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18వ ఓవర్‌ ఆఖరి బంతికి రషీద్‌ బాదిన సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బ్యారీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో రషీద్‌ బంతిని చూడకుండానే సిక్సర్‌గా మలిచాడు. లెగ్‌సైడ్‌ దిశగా మెక్‌కార్తీ సంధించిన ఫుల్‌ టాస్‌ బంతిని రషీద్‌ కళ్లు మూసుకుని సిక్సర్‌ కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో ఇరగదీసిన రషీద్‌.. (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌), మొహమ్మద్‌ నబీ (38 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీఖుల్లా అటల్‌ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌తో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అదైర్‌ 3, జాషువ లిటిల్‌, బ్యారీ మెక్‌కార్తీ తలో 2 వికెట్లు, బెంజమిన్‌ వైట్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌.. రషీద్‌ ఖాన్‌ (4-0-14-4), ఖరోటే (4-0-23-2), నబీ (3-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో బల్బిర్నీ (45), గ్యారెత్‌ డెలానీ (39) మాత్రమే రాణించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌ తొలి మ్యాచ్‌లో గెలవగా.. ఆఫ్ఘనిస్తాన్‌ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (మార్చి 18) జరుగనుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement