Ravichandran Ashwin: టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టేసిన భారత స్పిన్నర్

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1 బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు

Ravichandran Ashwin (Photo credit: Twitter)

Ravichandran Ashwin replaces James Anderson: టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1 బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు.స్వదేశంలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అశ్విన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన ఈ వెటరన్‌ స్పిన్నర్‌.. ఢిల్లీ టెస్టులోనూ అద్భుతంగా రాణించాడు.

ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌ 

1. రవిచంద్రన్‌ అశ్విన్‌- ఇండియా- 864 పాయింట్లు

2. జేమ్స్‌ ఆండర్సన్‌- ఇంగ్లండ్‌- 859 పాయింట్లు

3. ప్యాట్‌ కమిన్స్‌- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు

4. జస్‌ప్రీత్‌ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు

5. షాహిన్‌ ఆఫ్రిది- పాకిస్తాన్‌- 787 పాయింట్లు

Here's List

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement