IPL 2023: రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు, IPL చరిత్రలో 150 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ బౌలర్‌గా నిలిచిన జడ్డూ భాయ్
జడేజా తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్ అక్షర్ పటేల్. మొత్తం 112 వికెట్లు తీసాడు.
మే 23, మంగళవారం జరిగిన గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా IPL చరిత్రలో 150 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ బౌలర్‌గా నిలిచాడు. జడేజా తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్ అక్షర్ పటేల్. మొత్తం 112 వికెట్లు తీసాడు. ఇక డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ధోనీ సేన 15 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ మెడలు వంచిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఐపీఎల్‌లో గుజరాత్ ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడగా, ఈ మ్యాచ్‌కు ముందు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు. ఆలౌట్ విషయంలో గుజరాత్ అన్ బీటన్ రికార్డును సీఎస్‌కే చెరిపివేసింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)