Rinku Singh Apologises Video: వీడియో ఇదిగో, అద్దం పగిలినందుకు క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌, సో క్యూట్‌ రింకూ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు

ఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించాను. నా షాట్‌ కారణంగా అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. గ్లాస్‌ బ్రేక్‌ చేసినందుకు సారీ చెబుతున్నా’’ అని రింకూ సింగ్‌ పేర్కొన్నాడు.

Rinku sing (photo-BCCI)

టీమిండియా తరఫున టీ20లలో అదరగొడుతున్న యువ బ్యాటర్‌ రింకూ సింగ్‌ సారీ చెప్పాడు. ఇంతకీ విషయం ఏంటంటే..పందొమ్మిదవ ఓవర్లో మార్క్రమ్‌ బౌలింగ్‌లో రింకూ స్ట్రెయిట్‌ హిట్‌ కారణంగా సైట్‌స్క్రీన్‌ బ్రేక్‌ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి మ్యాచ్‌ అనంతరం స్పందించిన రింకూ సింగ్‌.. స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు.

ఈ మేరకు బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో తన ప్రదర్శన గురించి మాట్లాడుతున్న సమయంలో.. ‘‘ఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించాను. నా షాట్‌ కారణంగా అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. గ్లాస్‌ బ్రేక్‌ చేసినందుకు సారీ చెబుతున్నా’’ అని రింకూ సింగ్‌ పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సో క్యూట్‌ రింకూ.. నీ ఆటతోనే కాదు అమాయకత్వపు, హుందాతనపు మాటలతోనూ మా మనసులు దోచుకున్నావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement