Rishabh Pant Accident CCTV Footage: రిషబ్ పంత్ యాక్సిడెంట్ వీడియో వైరల్, నిద్రమత్తులో ఉన్న కారణంగా తన కారు డివైడర్‌ను ఢీకొన్నట్లు తెలిపిన పంత్

భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా పంత్‌ కారు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ అవుతోంది.

Rishabh Pant (Phot-Twitter)

భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా పంత్‌ కారు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ అవుతోంది. దీని ప్రకారం.. వేగంగా దూసుకొచ్చిన కారు.. డివైడర్‌ను ఢీకొట్టింది. ఇక ఆ తర్వాత కారుకు మంటలు అంటుకోగా.. అగ్నికి ఆహుతైపోయింది. పంత్‌ స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.ప్రమాద సమయంలో పంత్‌ ఒక్కడే కారులో ఉన్నాడు. ఉదయం సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తులో ఉన్న కారణంగా తన కారు డివైడర్‌ను ఢీకొన్నట్లు పంత్‌ చెప్పాడని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement