Rod Marsh Dies: క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ గుండెపోటుతో కన్నుమూత
క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ ఈ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో అడిలైడ్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన మరణించినట్టు స్పోర్ట్స్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ తెలిపింది. 74 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.
క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ ఈ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో అడిలైడ్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన మరణించినట్టు స్పోర్ట్స్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ తెలిపింది. 74 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. 1970 నుంచి 1984 వరకు ఆస్ట్రేలియా తరపున ఆయన 96 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. ఆస్ట్రేలియా దిగ్గజ కీపర్ గా పేరుతెచ్చుకున్నాడు. వికెట్ కీపర్ గా 355 ఔట్ లు చేశారు. ఆస్ట్రేలియా తరపున రాడ్ మార్ష్ 92 వన్డేలు కూడా ఆడాడు. టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా తరపున సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ ఈయనే కావడం గమనార్హం. రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లోని జాతీయ క్రికెట్ అకాడెమీలకు ఆయన నాయకత్వం వహించారు. ఐసీసీ ప్రపంచ కోచింగ్ అకాడెమీకి ప్రారంభ అధిపతిగా పని చేశారు. 2014లో ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్ గా నియమితులయ్యారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)