Rohit Sharma Dance Video: రోహిత్‌ శర్మ డ్యాన్స్ వీడియో ఇదిగో, స్థానిక మహిళలతో కలిసి చిందేసిన టీమిండియా కెప్టెన్, ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్న భారత జట్టు

Rohit Sharma Dance Video

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) సాధించి విశ్వవిజేతగా నిలిచిన రోహిత్‌ సేన ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టింది. మ్యాచ్‌ అనంతరం బెరిల్‌ హరికేన్‌ తుఫాను కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన రోహిత్‌ సేన.. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీలో దిగింది. వారికి యావత్ భారతదేశం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా బార్బడోస్ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మన T20 ప్రపంచకప్ విజేత భారత జట్టు స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు హృదయపూర్వక స్వాగతం. దేశమంతా మీకు స్వాగతం పలకడానికి ఉవ్విళ్లూరుతోంది అంటూ కేంద్ర మంత్రి Dr Mansukh Mandaviya వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.  న్యూఢిల్లీకి చేరుకున్న వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నర్స్, ఎయిర్ పోర్టు ద‌గ్గ‌ర కోలాహలం, స్వదేశంలో అడుగు పెట్టిన వెంట‌నే రోహిత్, కోహ్లీ ఏం చేశారో చూడండి!

ఇక టీమ్‌ ఇండియా (Team India) జట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి ( PM Modis residence) చేరుకుంది. ఉదయం ఐటీసీ మయూర నుంచి బస్సులో బయల్దేరిన రోహిత్‌ సేన.. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ (Lok Kalyan Marg)లోని మోదీ ఇంటికి వెళ్లింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)