Rohit Sharma: బార్బడోస్ పిచ్‌లోని మట్టిని తినడానికి గల కారణాన్ని వివరించిన రోహిత్ శర్మ, ఎప్పటికి తనకు గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతోనే..
పిచ్ మట్టిని తినాలని ముందుగా అనుకోలేదు. కానీ, ఆ క్షణం ఎందుకో అలా చేయాలనిపించింది. మ్యాచ్ అనంతరం పిచ్ దగ్గరికి వెళ్లాను. మాకు ట్రోఫీ అందించిన పిచ్ అది. అందుకని ఆ మైదానాన్ని, ఆ పిచ్‌ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. అందుకనే ఈ విజయానికి జ్ఞాపకంగా పిచ్ మట్టిని టేస్ట్ చేశాను’ అని రోహిత్ వెల్లడించాడు.
టీ20 వరల్డ్‌కప్-2024ను 13 ఏళ్ళ తరువాత భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది.ఈ విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ గెలుపొందిన వెంటనే నెలను ముద్దాడాడు. అంతేకాకుండా బార్బడోస్ పిచ్‌లోని మట్టిని తిని అందరిని ఆశ్చర్యపరిచాడు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
తాజాగా ఆన్‌లైన్‌లో తన ఫోటో వైరల్ కావడంపై హిట్‌మ్యాన్ స్పందించాడు. పిచ్ మట్టిని తినాలని ముందుగా అనుకోలేదు. కానీ, ఆ క్షణం ఎందుకో అలా చేయాలనిపించింది. మ్యాచ్ అనంతరం పిచ్ దగ్గరికి వెళ్లాను. మాకు ట్రోఫీ అందించిన పిచ్ అది. అందుకని ఆ మైదానాన్ని, ఆ పిచ్‌ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. అందుకనే ఈ విజయానికి జ్ఞాపకంగా పిచ్ మట్టిని టేస్ట్ చేశాను’ అని రోహిత్ వెల్లడించాడు.బార్బడోస్ మైదానం ఎప్పటికి తనకు గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతోనే మట్టిని తిన్నానని రోహిత్ చెప్పుకొచ్చాడు.నిజంగా ఆ క్షణాలు మరలేనివి. ఈ విజయం కోసమే ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నామని" బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)