Sanju Samson Fans Protest: సంజూ శాంసన్‌ను ఇండియా టీంలోకి తీసుకోవాల్సిందే, FIFA ప్రపంచకప్ 2022లో బ్యానర్లతో మద్ధతుగా నిలుస్తున్న అభిమానులు

సంజూ శాంసన్ అభిమానులు భారత్ మ్యాచ్‌లు,సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న FIFA ప్రపంచ కప్ 2022లో కూడా అతనికి మద్దతునిస్తున్నారు. అభిమానులు ప్రత్యేక బ్యానర్‌లను ప్రదర్శించడం, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం సందేశాలు ఇవ్వడం కనిపించింది,

Sanju Samson (Photo credit: Twitter)

సంజూ శాంసన్ అభిమానులు భారత్ మ్యాచ్‌లు,సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న FIFA ప్రపంచ కప్ 2022లో కూడా అతనికి మద్దతునిస్తున్నారు. అభిమానులు ప్రత్యేక బ్యానర్‌లను ప్రదర్శించడం, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం సందేశాలు ఇవ్వడం కనిపించింది, అతను ప్రస్తుతం కొనసాగుతున్న భారత్‌ టీంలో ఎక్కువగా బెంచ్‌లోనే ఉన్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్, తొలి వన్డేలో ఆరో స్థానంలో వచ్చి 30+ పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఐదో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు సంజూ శాంసన్. అయితే తొలి వన్డేలో 307 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. దీంతో రెండో వన్డేలో రెండు మార్పులు చేసిన భారత జట్టు... దీపక్ హుడాని తుది జట్టులోకి తేవడం కోసం సంజూ శాంసన్‌పై వేటు వేసింది.

Support for Sanju Samson

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement