Alasdair Evans Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో బౌలర్, పదిహేనేళ్ల ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన స్కాట్లాండ్ బౌలర్ అలస్డేర్ ఇవాన్స్
పదిహేనేళ్ల తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. 2009లో కెనడాతో వన్డే మ్యాచ్‌తో ఇవాన్స్ స్కాట్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 42 వన్డేలు, 35 టీ20లు ఆడాడు.
స్కాట్లాండ్ బౌలర్ అలస్డేర్ ఇవాన్స్(Alasdair Evans) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదిహేనేళ్ల తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. 2009లో కెనడాతో వన్డే మ్యాచ్‌తో ఇవాన్స్ స్కాట్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 42 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో ఈ పేస్ బౌలర్ 58, 41 వికెట్లు తీశాడు. చివరగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో శ్రీలంక తరఫున మ్యాచ్ ఆడాడు. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన అతడు..తాజాగా ఆటకు వీడ్కోలు పలుకుతూ ప్రకటన విడుదల చేశాడు.సుదీర్ఘకాలం పాటు కెరీర్ కొనసాగించేందుకు సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ఈ సందర్భంగా ఇవాన్స్ కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు.
Here's News