Shubman Gill Slams First Century: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీతో అదరగొట్టిన శుభ్‌మన్‌ గిల్‌, ఆరు వికెట్ల తేడాగో బంగ్లాపై భారత్ ఘన విజయం

చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన 2013 ఛాంపియన్స్ బంగ్లాపై ఆరు వికెట్ల తేడాతో సమగ్ర విజయాన్ని సాధించారు.భారత వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు. భారత ఓపెనర్ 101 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును ఆధిపత్య విజయానికి నడిపించాడు

Shubman Gill. (Photo credits: X/@BCCI)

చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన 2013 ఛాంపియన్స్ బంగ్లాపై ఆరు వికెట్ల తేడాతో సమగ్ర విజయాన్ని సాధించారు.భారత వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు. భారత ఓపెనర్ 101 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును ఆధిపత్య విజయానికి నడిపించాడు. గిల్‌ 128 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, రెండు భారీ సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేయగా.. కేఎల్‌ రాహుల్‌ 47 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లతో నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో రషిద్‌కు రెండు, తక్సిన్‌ అహ్మద్‌, రెహమాన్‌కు చెరో వికెట్‌ దక్కింది.

వీడియో ఇదిగో, గిల్ కొట్టిన సిక్స్ దెబ్బకు ఒక్కసారిగా షాకైన రోహిత్ శర్మ, ఇదేం షాట్ అంటూ వెరైటీ ఎక్స్‌ప్రెషన్

ఈ మ్యాచ్ లో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కొట్టిన ఓ షాట్‌కు రోహిత్ షాక్ అయ్యాడు. బౌన్సర్‌ను వెంటనే పిక్ చేసిన గిల్.. లెగ్ సైడ్ కళ్లుచెదిరే రీతిలో పుల్ షాట్‌గా మలిచాడు. నిల్చున్న చోటు నుంచే స్టేడియంలోకి తరలించాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. దీంతో నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ షాక్ అయ్యాడు. ఇదేం షాట్ అంటూ వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Shubman Gill Slams First Century:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement