Asia Cup 2022: లంక క్రికెట‌ర్ల‌కు స్వ‌దేశంలో ఘ‌న స్వాగ‌తం, డ‌బుల్ డ‌క్క‌ర్ బ‌స్సులో ప్ర‌యాణించిన ఫోటోల‌ను ట్వీట్ చేసిన శ్రీలంక క్రికెట్

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న శ్రీలంక‌లో విక్ట‌రీ ప‌రేడ్ జ‌రిగింది. ఆసియాక‌ప్ ఫైన‌ల్లో పాకిస్థాన్‌పై విజ‌యం సాధించి ఆరోసారి ఆ టైటిల్‌ను ఎగురేసుకుపోయిన లంక క్రికెట‌ర్ల‌కు స్వ‌దేశంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

Sri Lanka Cricketers Celebrate Sixth Asia Cup Title Victory (Photo-Twitter)

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న శ్రీలంక‌లో విక్ట‌రీ ప‌రేడ్ జ‌రిగింది. ఆసియాక‌ప్ ఫైన‌ల్లో పాకిస్థాన్‌పై విజ‌యం సాధించి ఆరోసారి ఆ టైటిల్‌ను ఎగురేసుకుపోయిన లంక క్రికెట‌ర్ల‌కు స్వ‌దేశంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు, క్రీడా మంత్రిత్వ‌శాఖ‌లు బండారునాయ‌కే ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద లంక క్రికెట‌ర్ల‌కు వెల్క‌మ్ ప‌లికారు. ఆ త‌ర్వాత భారీ రీతిలో క్రికెట‌ర్లు విక్ట‌రీ ప‌రేడ్‌లో పాల్గొన్నారు. లంక ప్లేయ‌ర్లు డ‌బుల్ డ‌క్క‌ర్ బ‌స్సులో ప్ర‌యాణించిన ఫోటోల‌ను శ్రీలంక క్రికెట్ ట్వీట్ చేసింది. రోడ్డుకు ఇరువైపు ఉన్న అభిమానులు చీర్స్ చేశారు. అభిమానుల‌తో క్రికెట‌ర్లు ముచ్చ‌టించారు. మ‌ద్ద‌తు ఇచ్చిన‌వారికి థ్యాంక్స్ తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement