Romario Shepherd Catch Video: వీడియో ఇదిగో, కొన్ని అడుగుల పాటు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టిన రొమారియో షెపర్డ్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విండీస్ ఆటగాడు, జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అందుకున్నాడు. బౌలర్ నండ్రే బర్గర్ ఈ క్యాచ్ చూసి కొద్దిసేపటి వరకు అలాగే షాక్‌లో ఉండిపోయాడు.నిన్న (జనవరి 15) డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విండీస్ ఆటగాడు, జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అందుకున్నాడు. బౌలర్ నండ్రే బర్గర్ ఈ క్యాచ్ చూసి కొద్దిసేపటి వరకు అలాగే షాక్‌లో ఉండిపోయాడు.నిన్న (జనవరి 15) డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. షెపర్డ్ కొన్ని అడుగుల పాటు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ జట్టు సూపర్ జెయింట్స్ చేతిలో 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్వల్ప ఛేదనలో సూపర్ కింగ్స్ బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలమై ఓటమిని కొనితెచ్చుకున్నారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (జనవరి 16) ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ తలపడనున్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)