T20 World Cup 2022: మ్యాచ్ ఆగితే భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టమే, డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం బంగ్లాదేశ్‌నే విజేత, ఆట తిరిగి ప్రారంభం కావాలని కోరుకుంటున్న భారత అభిమానులు

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడ్డాయి.టీమిండియా నిర్ధేశించిన 185 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. 7వ ఓవర్‌ అనంతరం ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.

Team India (Photo-Twitter)

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడ్డాయి.టీమిండియా నిర్ధేశించిన 185 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. 7వ ఓవర్‌ అనంతరం ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం అంతరాయం కలిగించే సమాయానికి బంగ్లాదేశ్‌ వికెట్‌ నష్టపోకుండా 66 పరుగులు చేసింది.

లిట్టన్‌ దాస్‌ 59, హొస్సేస్‌ షాంటో ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. ర్షం ఎంతకు తగ్గకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం విజేతను ప్రకటించాల్సి ఉంటుంది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం చూస్తే బంగ్లాదేశ్‌ 17 పరుగులు ముందంజలో ఉంది. దీంతో బంగ్లాదేశ్‌నే విజేతగా ప్రకటిస్తారు. మరి కొద్ది సేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుందని ఐసీసీ ట్వీట్ ద్వారా తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement