T20 World Cup: వైరల్ వీడియోలు, కోహ్లీ ఫీల్డింగ్ చూస్తే ఫిదా కావాల్సిందే, మెరుపువేగంతో త్రో వేసి రనౌట్, బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్
ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హర్షల్ పటేల్ వేసిన రెండో బంతిని జోష్ ఇంగ్లిస్ ఆన్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే క్విక్ సింగిల్ కోసం ఇంగ్లిస్ ప్రయత్నించడంతో టిమ్ డేవిడ్ స్పందించాడు.
ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హర్షల్ పటేల్ వేసిన రెండో బంతిని జోష్ ఇంగ్లిస్ ఆన్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే క్విక్ సింగిల్ కోసం ఇంగ్లిస్ ప్రయత్నించడంతో టిమ్ డేవిడ్ స్పందించాడు. అయితే ఇక్కడే కోహ్లి తన ఫీల్డింగ్ మ్యాజిక్ చూపించాడు. బంతిని అందుకున్న కోహ్లి బులెట్ వేగంతో త్రో వేయగా.. టిమ్ డేవిడ్ క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో డేవిడ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో షమీ వేసిన లో ఫుల్‌టాస్ బంతిని లాంగాన్ దిశగా ఆడాడు. అది సిక్స్ అని అంతా భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లి అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. దీంతో నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు చేసి చూపెట్టాడు.. దటీజ్ కింగ్ కోహ్లి'' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.