India T20 World Cup Squad: రిషబ్ పంత్ రీ ఎంట్రీ, టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ఇదిగో, కెప్టెన్‌గా రోహిత్ శర్మ, పేస్ భారం మోయనున్న బుమ్రా టీం
మరో నెలరోజుల్లో వెస్టిండీస్/అమెరికా వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ 19 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. మరో నెలరోజుల్లో వెస్టిండీస్/అమెరికా వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ 19 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా, హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీ20 వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ స్క్వాడ్ ఇదే, తొలిసారి పొట్టి ప్రపంచకప్ జట్టులోకి స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ
భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీ కొట్టనుంది. ‘గ్రూప్ ఏ’లో ఉన్న భారత్-పాక్ జట్లు న్యూయార్క్ వేదికగా జూన్ 9న తలపడనున్నాయి. ఈ పొట్టికప్పు సిరీస్‌లో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. అమెరికాలో 3, వెస్టిండీస్‌లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది.
టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, సిరాజ్.
ట్రావెలింగ్ రిజర్వ్: శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్‌ఖాన్
Here's Team
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)