త్వరలోనే ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం మే 1వ తేదీలోగా తమ జట్లని ప్రకటించాలని ఐసీసీ (ICC) సూచించిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ (New Zealand) బోర్డ్ తమ జట్టుని ఇద్దరు చిన్నారులతో ప్రకటించింది. ఇద్దరు చిన్నారులు మటిల్డా, ఆంగస్ ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక జట్టు విషయానికి వస్తే స్టార్ పేస‌ర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) తొలిసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.బెన్ సియ‌ర్స్ ట్రావెలింగ్ రిజ‌ర్వ్‌గా చోటు ద‌క్కించుకున్నాడు.అమెరికా, వెస్టిండీస్ అతిథ్య‌మిస్తున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ పోటీలు జూన్ 1వ తేదీన షురూ కానున్నాయి.

న్యూజిలాండ్ స్క్వాడ్ : కేన్ విలియ‌మ్స‌న్(కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్‌మ‌న్, డెవాన్ కాన్వే, లూకీ ఫెర్గూస‌న్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీష‌మ్, గ్లెన్ ఫిలిఫ్స్, ర‌చిన్ ర‌వీంద్ర‌, మిచెల్ శాంట్న‌ర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, ట్రావెలింగ్ రిజ‌ర్వ్ – బెన్ సియర్స్.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)