HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మరో కేసు, టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఫిర్యాదు చేసిన యువకుడు, కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదయింది. గత ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదయింది. గత ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టికెట్లపై సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని ముద్రించారని, కానీ ఆట మాత్రం 7 గంటలకే ప్రారంభమైందని అందులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)