T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో ఘోర పరాభవం పొందిన జట్లు ఇవే, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన యూఎస్‌ఏ

తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ ఓ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన పాక్‌కు ఊహించని షాక్‌ ఇవ్వడం క్రికెట్‌ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘోర పరాభవాన్ని ఊహించని పాక్‌ ఇంకా షాక్‌లోనే ఉండిపోయింది.

USA Stuns Pakistan

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో నిన్న (జూన్‌ 6) పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ సూపర్‌ ఓవర్‌లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ ఓ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన పాక్‌కు ఊహించని షాక్‌ ఇవ్వడం క్రికెట్‌ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘోర పరాభవాన్ని ఊహించని పాక్‌ ఇంకా షాక్‌లోనే ఉండిపోయింది.  నిప్పులు చెరిగిన బౌలర్లు, రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్, ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

పాక్‌పై యూఎస్‌ఏ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఐసీసీ టాప్‌-5 బిగ్గెస్ట్‌ అప్‌సెట్స్‌ (టీ20 వరల్డ్‌కప్‌) జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పాక్‌-యూఎస్‌ఏ మ్యాచే అగ్రస్థానంలో నిలువడం విశేషం. ఈ జాబితాలో మిగతా నాలుగు సంచలనాలు వరుస క్రమంలో ఇలా ఉన్నాయి.

2022 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

2022 ప్రపంచకప్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన నమీబియా

2016 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించిన ఆఫ్ఘనిస్తాన్‌

2009 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఓడించిన నెదర్లాండ్స్‌

పై పేర్కొన్న మ్యాచ్‌లను ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అతి భారీ సంచలనాలుగా పరిగణించింది.

Here's ICC News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement