Sarfaraz Khan in India’s Squad: టీమిండియాకు ఎంపిక అయిన సర్ఫరాజ్ ఖాన్, సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్‌ అంటూ అభినందనలు తెలిపిన సూర్యకుమార్ యాదవ్

ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండు టెస్టుకు సర్ఫరాజ్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వైజాగ్‌ టెస్టుకు కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా దూరం కావడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Suryakumar Yadav Congratulates Sarfaraz Khan for His Selection in India’s Squad for Second Test Against England

గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ కు భారత జట్టులోకి ఎంట్రీ లభించింది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండు టెస్టుకు సర్ఫరాజ్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వైజాగ్‌ టెస్టుకు కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా దూరం కావడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్ఫరాజ్‌తో పాటు యూపీ ఆల్‌రౌండర్‌ సౌరభ్ కుమార్, వాషింగ్టన్‌ సుందర్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఈ క్రమంలో సర్ఫరాజ్‌కు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ అభినందనలు తెలిపాడు. భారత జట్టు నుంచి తొలిసారి పిలుపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్‌ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. వీరిద్దరూ దేశీవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు 45 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 69.85 సగటుతో 3,912 రన్స్ చేశాడు. 14 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.

Here's News

 

View this post on Instagram

 

A post shared by CricSpirit (@cricspirit)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

Karnataka Shocker: మదమెక్కి కూతురిని రేప్ చేయబోయిన తాగుబోతు తండ్రి, కామాంధుడిని చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికిన ఆమె తల్లి

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)