Virat Kohli: విరాట్ కోహ్లీనే మళ్లీ నంబర్ వన్, వరుసగా ఐదో ఏడాదీ భారత్ తరఫున అత్యంత విలువైన సెలెబ్రిటీగా రికార్డు, రూ. 1404 కోట్ల బ్రాండ్ వాల్యూతో అగ్రస్థానం
భారత్ తరఫున అత్యంత విలువైన సెలెబ్రిటీల జాబితాలో వరుసగా ఐదో ఏడాదీ కోహ్లీనే నెంబర్‌వన్‌గా నిలిచాడు. 2021 ఏడాదికిగాను డఫ్ అండ్ ఫెల్ఫ్స్ సంస్థ ప్రకటించిన భారత మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీల్లో విరాట్.. రూ. 1404 కోట్ల బ్రాండ్ వాల్యూతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోయినా, జట్టు కెప్టెన్సీ కోల్పోయినా విరాట్ కోహ్లీ బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. భారత్ తరఫున అత్యంత విలువైన సెలెబ్రిటీల జాబితాలో వరుసగా ఐదో ఏడాదీ కోహ్లీనే నెంబర్‌వన్‌గా నిలిచాడు. 2021 ఏడాదికిగాను డఫ్ అండ్ ఫెల్ఫ్స్ సంస్థ ప్రకటించిన భారత మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీల్లో విరాట్.. రూ. 1404 కోట్ల బ్రాండ్ వాల్యూతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
బాలీవుడ్ స్టార్లు రణ్‌వీర్ సింగ్ (రూ. 1195 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ. 1050 కోట్లు), అలియా భట్ (రూ. 515 కోట్లు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలవగా.. రూ. 462 కోట్లతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐదోస్థానాన్ని దక్కించుకున్నాడు. సచిన్ టెండూల్కర్ (రూ. 355 కోట్లు) 11వ, టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మ (రూ. 240 కోట్లు) 13వ స్థానాల్లో ఉన్నారు. ఇక.. గతవారం స్విస్ ఓపెన్ చాంప్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, ఏస్ షట్లర్ పీవీ సింధు రూ. 165 కోట్ల సంపాదనతో 20వ ర్యాంకులో నిలిచింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)