Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర, 4వ సారి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న టీమిండియా స్టార్, ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు గెలుచుకున్నది కూడా కోహ్లీనే..
యాభై ఓవర్ల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 2012, 2017, 2018లో కింగ్ ఈ పురస్కారాలు అందుకున్నాడు. తాజాగా మరోసారి అవార్డును తన కైవసం చేసుకున్న కోహ్లి.. ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు.క్రికెట్ ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా కూడా కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్, మాజీ క్రికెటర్ ఏబీడీ గతంలో మూడుసార్లు ఈ అవార్డు గెలిచాడు.
Here's News
Tags
ICC
ICC Men's ODI Cricketer of the Year 2023
ICC Men’s ODI Cricketer of the Year Award
ICC Men’s ODI Cricketer of the Year Award 2023
International Cricket Council
Kohli
Virat Kohli
అంతర్జాతీయ క్రికెట్ మండలి
ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు
విరాట్ కోహ్లి