Matheesha Pathirana:శ్రీలంక నుంచి మరో లసిత్ మలింగా, తొలి బంతికే వికెట్ తీసుకున్న మతీషా పతిరనా, 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన యువ పేసర్
ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరనా తనదైన శైలి ఆటతో రెచ్చిపోయాడు. జూనియర్ మలింగగా పెరొందిన పతిరనా ఈ మ్యాచ్‌లో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు
ఐపీఎల్‌లో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరనా చెన్నై సూపర్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరనా తనదైన శైలి ఆటతో రెచ్చిపోయాడు. జూనియర్ మలింగగా పెరొందిన పతిరనా ఈ మ్యాచ్‌లో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా తన వేసిన తొలి బంతికే వికెట్ సాధించడం విశేషం. శుభ్‌మాన్ గిల్‌ను పతిరనా ఎల్బీడబ్ల్యూ చేశాడు. అచ్చం శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ లాగే పతిరనా బౌలింగ్ చేస్తున్నాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)