7 Runs In One Ball Video: వీడియో ఇదిగో, ఒక్క బంతికే ఏడు పరుగులు సమర్పించుకున్న పాకిస్తాన్, సిక్స్ కొట్టకుండానే ఏడు పరుగులు పిండుకున్న ఆస్ట్రేలియా
కాన్‌బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడతోంది.ఈ వార్మప్ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట సందర్బంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన దాయాది పాకిస్తాన్ జట్టు.. కాన్‌బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడతోంది.ఈ వార్మప్ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆట సందర్బంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాక్ ఒక్క బంతికే ఏడు పరుగులు సమర్పించుకుంది.ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన ఆఫ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో చివరి బంతికి రెన్షా కవర్స్ దిశగా షాట్ ఆడాడు. అయితే పాక్ ఫీల్డర్ మీర్ హమ్జా పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ బంతిని అద్బుతంగా ఆపాడు.
ఈ క్రమంలో ప్రైమ్ మినిస్టర్స్ బ్యాటర్లు మూడు పరుగులను పూర్తి చేశారు. అయితే నాన్‌స్ట్రైక్‌లో ఎండ్‌లో బంతి అందుకున్న బాబర్ ఆజం.. కీపర్ వైపు బలంగా త్రో చేశాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్‌తో పాటు ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ కూడా బంతిని ఆపలేకపోవడంతో బంతి బౌండరీకీ వెళ్లింది. దీంతో రెన్షా ఖతాలో ఏడు పరుగులు చేరాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాక్ తలపడనుంది. డిసెంబర్ 14న పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)